పట్రపెరంబదూరులోని సొరంగం పరిశీలన
తిరువళ్లూరు: పట్రపెరంబదూరు గ్రామంలోని మురుగన్ ఆలయం వద్ద ఇటీవల బయటపడ్డ సొరంగం మార్గంలోకి అధికారులు దిగి పరిశోధనలు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరు గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వుంది. ఆలయానికి సమీపంలో ఇటీవల తిరుపతి–చైన్నె జాతీయ రఽహదారి నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో 9వ శతాబ్దం నాటి విగ్రహాలు, ఆలయానికి సమీపంలో సొరంగం బయటపడింది. పట్రపెరంబదూరు నుంచి తిరువేళాంగాడు వరకు 12 కిమీ మేరకు సొరంగ మార్గం వుందని, ఈ మార్గంలో భారీగా ఆభరణాలు కూడా వుండొచ్చని గ్రామస్తులు పురావస్తుశాఖ అధికారులకు వివరించారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. సొరంగంలోకి అగ్నిమాపక శాఖకు చెందిన ముగ్గురు, పురావస్తుశాఖ జిల్లా అధికారి లోకనాథన్, రెవెన్యూ అధికారి ఒకరు సొరంగ మార్గంలో దిగి పరిశీలించారు. మొదటి దశలో చేపట్టిన పరిశోధనలో సొరంగమార్గంలో రెండు గదులు వున్నట్టు గుర్తించారు. మరింత లోతైన పరిశోధనలను త్వరలోనే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment