ఆమ్నీ బస్సు బోల్తా
● ఇద్దరు దుర్మరణం ● 20 మందికి గాయాలు
సేలం: ఈరోడ్ సమీపంలోని కోయంబత్తూరు– సేలం జాతీయ రహదారిలో ఆమ్నీబస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌లో వెళుతున్న ఇద్దరు దుర్మరణం చెందారు. బస్సులోని 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఒక ప్రైవేటు ఆమ్నీ బస్సు 25 మందికి పైగా ప్రయాణికులతో కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు గురువారం ప్రయాణిస్తోంది. ఈ బస్సు ఈరోడ్ జిల్లా పెరుందురైలోని విజయమంగళం టోల్‌గేట్ సమీపంలో కోయంబత్తూరు – సేలం రహదారిపై ప్రయాణిస్తుండగా ద్విచక్ర వాహనం రోడ్డు దాటడానికి ప్రయత్నించి బస్సును ఢీకొంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుర్మరణం చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పెరుందురైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పెరుందురై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment