● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్‌

Published Fri, Mar 7 2025 10:12 AM | Last Updated on Fri, Mar 7 2025 10:08 AM

● ప్ర

● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్

రెవెన్యూ అధికారులకు కొత్త వాహనాలు

సచివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారుల ఉపయోగం కోసం వాహనాలను పంపిణీ చేశారు. రూ. 4.58 కోట్లతో కొనుగోలు చేసిన 51 వాహనాలకు సీఎం స్టాలిన్‌ జెండా ఊపారు. ఆయా అధికారులకు తాళాలను అందజేశారు. 2021లో అధికారం చేపట్టినప్పటినప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ అధికారుల ఉపయోగానికి రూ. 16 కోట్ల 46 లక్షల 57 వేలతో 150 కొత్త వాహనాలను కొనుగోలు చేసి అందించారు. తాజాగా కొనుగోలు చేసిన 51 వాహనాలు బొలెరో వాహనాలే. నలుగురు అదనపు డిప్యూటీ కలెక్టర్లకు, 47 తాలుకాలలోని అధికారుల ఉపయోగానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో, అటవీ మంత్రి డాక్టర్‌ కె.పొన్ముడి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.కె.ఎస్‌.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌, ప్రధాన కార్యదర్శి మురుగానందం, రెవిన్యూ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎం. సాయికుమార్‌, అదనపు ముఖ్య కార్యదర్శి, పి. అముధ, ప్రత్యేక కార్యదర్శి . గణేష్‌, , అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌. నటరాజన్‌ పాల్గొన్నారు.

సాక్షి, చైన్నె: తమిళాభివృద్ధి, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో సీనియర్‌ జర్నలిస్టు, కళాకారులకు అవార్డులను ఏటా ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి గాను కలైంజ్ఞర్‌ పేనా అవార్డును సీనియర్‌ జర్నలిస్టులు నక్కిరన్‌ గోపాల్‌, సుకితా సారంగరాజ్‌ను ఎంపిక చేశారు. వీరికి సీఎం స్టాలిన్‌ ఈ అవార్డులను, నగదు ప్రోత్సహం అందజేశారు. అలాగే రూ.5 లక్షల ప్రైజ్‌ మనీ, ప్రశంసా పత్రంను సీఎం స్టాలిన్‌ అందజేసి సత్కరించారు. నక్కీరన్‌ అనే పరిశోధనాత్మక పత్రికను ప్రారంభించి నక్కీరన్‌ గోపాల్‌గా పేరు సంపాదించుకున్నందుకు ఈ అవార్డును అందజేశారు. అలాగే వివిధ టీవీ కార్యక్రమాలలో సీ్త్రతత్వం గురించి 18 సంవత్సరాలకు పైగా ప్రశంగాలను ఇస్తూ వస్తున్న సుకితా సారంగరాజ్‌ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళ అభివృద్ధి ,సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, తమిళాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజారామన్‌, సమాచార డైరెక్టర్‌ వైద్యనాథన్‌ పాల్గొన్నారు.

రిజిస్టేషన్‌ కార్యాలయాలు..

రిజిస్ట్రేషన్‌ శాఖ తరపున తిరువళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్‌ జిల్లాను సృష్టించారు. ఇందుకు సంబంధించిన సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రూ. 22.36 కోట్లతో 12 కొత్త సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణం జరిగింది. ప్రజలకు అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలను విస్తృతం చేసే విధంగా 2024–2025 సంవత్సరానికి వాణిజ్య పన్ను రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయం మేరకు తిరువళ్లూరు రెవిన్యూ జిల్లాలోని జాయింట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని గ్రామాలను విభజించి 2వ జాయింట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తంజావూరు జిల్లా – ఒరతనాడు, తిరువారూర్‌ జిల్లా – తిరుతురైపూండి , వలంగైమాన్‌, మధురై జిల్లా – తిరుమంగళం, కాంచీపురం జిల్లా – శ్రీపెరంబుదూర్‌, తిరుపూర్‌ జిల్లా – తారపురం, తూత్తుకుడి జిల్లా – ఎట్టియాపురం, సాత్తాంకుళం, శ్రీవైకుంఠం, విరుదునగర్‌ జిల్లా – రాజపాలయం, పుదుక్కోట్టై జిల్లా – విరాలిమలై, కరూర్‌ జిల్లా – కులితలైలలో రూ. 22.36 కోట్లతో నిర్మించిన 12 కొత్త సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాలను సీఎం వీడియో కాన్ఫరన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రిమూర్తి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కార్యదర్శి కుమార్‌ జయంత్‌, రిజిస్ట్రేషన్‌ విభాగం హెడ్‌ దినేష్‌ పొన్‌రాజ్‌ లు పాల్గొన్నారు.

ఆరుగురికి కలైచెమ్మల్‌ అవార్డులు

సాంప్రదాయ చిత్రలేఖనం, ఆధునిక శైలి చిత్రలేఖనం, శిల్పకళలో ప్రతిభావంతులైన ఆరుగురికి సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా కళలు, సాంస్కృతిక శాఖ తరపున కలై చెమ్మల్‌ అవార్డులను అందజేశారు. 2024–2025 సంవత్సరానికి ’కలైచెమ్మల్‌’ అవార్డుతో పాటూ రాగి పతకం, లక్ష రూపాయల నగదు బహుమతి అందజేశారు. సాంప్రదాయ చిత్రలేఖన విభాగంలో ఎ. మణివేలు, సాంప్రదాయ శిల్ప విభాగంలో వి. బాలచందర్‌, కన్నియప్పన్‌, ఆధునిక చిత్రకారుడు కె. మురళీధరన్‌ , ఆధునిక శిల్ప విభాగంలో ఎ. సెల్వరాజ్‌ ,ఎన్‌. రాఘవన్‌లు ఈ అవార్డులను అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్1
1/2

● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్

● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్2
2/2

● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్‌ ● నంగనల్లూరులో హజ్‌ హౌస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement