దేశానికే గర్వకారణం
తమిళ సినిమా: సంగీత జ్ఞాని ఇళయరాజా శనివారం లండన్‌లో లైవ్ సింఫోనీ నిర్వహించనున్నడం తెలిసింది. అందుకు గురువారం ఉదయం ఆయన చైన్నె నుంచి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సింఫోనీ సంగీతాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన రాయల్ లండన్ సంగీత బృందం పనిచేస్తుందని చెప్పారు. సంగీతప్రియులు అలరించే విధంగా దీన్ని రూపొందించబోతున్నట్లు చెప్పారు. ఈ సింఫోనీ రూపకల్పన కార్యక్రమం లండన్‌లో 8వ తేదీన జరగనున్నట్లు తెలిపారు. అక్కడి ప్రేక్షకులకు ఈ కార్యక్రమం అద్భుతమైన సంగీత విందుగా ఉండబోతుందన్నారు. ఇంక్రీడబుల్ ఇండియా మాదిరిగా ఇంక్రీడబుల్ ఇళయరాజా అనేది తనకు అత్యంత గౌరవంగా భావిస్తున్నానని, అదేవిధంగా ఇది దేశానికే గర్వ కారణం అవుతుందని అన్నారు. మన గౌరవాన్ని లండన్‌లో చాటబోతున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు.
త్వరలో లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ
● మంత్రి కోవి చెళియన్ వెల్లడి
కొరుక్కుపేట: తమిళనాడులో ఖాళీగా ఉన్న అధ్యాపకులు, ఆచార్యుల పోస్టులను ఈ నెలాఖరులోగా, జూన్‌లోగా భర్తీ చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి సర్ కోవి చెలియన్ తెలిపారు. గురువారం ఉదయం ఈరోడ్‌లోని ప్రభుత్వ కళాశాలగా మార్చనున్న చిక్కయ్య నాయకర్ కళాశాలలో మంత్రులు కోవీ చెళియాన్, ముత్తుస్వామి వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెళియన్ మాట్లాడుతూ పెరియార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌పై కోర్టులోనూ, పోలీసులలోనూ ఆరోపణ ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు .మార్చి నెలాఖరు నాటికి వెయ్యి మంది అధ్యాపకులు, జూన్ నాటికి 4 వేల మంది ఆచార్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఎంపిక బోర్డు ఈ నెల 6, 7, 8 తేదీల్లో సెట్ పరీక్షను నిర్వహించనుంది. అందుకోసం హాల్‌టికెట్‌ను అందించామని ఖాళీ పోస్టుల భర్తీకి మరోసారి సెట్ పరీక్షను సెప్టెంబర్ – అక్టోబర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈరోడ్‌లో కరుణానిధి పేరుతో యూనివర్సిటీని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. యూజీసీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ శాసనసభలో తీర్మానం చేశారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.
10వ తేదీ నుంచి 4వ మార్గంలో రైలు సర్వీసు ప్రారంభం
కొరుక్కుపేట: చైన్నె బీచ్ –ఎగ్మోర్ రైలు మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండూ నడుస్తున్నాయి. అందులో అదనపు రైలు మార్గం లేకపోవడంతో యథాతథ స్థితి నెలకొంది. ఎగ్మూరు నుంచి చైన్నె బీచ్ వరకు 4వ రహదారిని నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయాణికుల డిమాండ్ చేశారు. రైల్వే బోర్డు తన రూ. 274.20 కోట్లతో 4వ మార్గం నిర్మాణం ఆగస్టు 2023 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం పనుల్లో 100 శాతం పూర్తికాగా, చైన్నె బీచ్ –ఎగ్మూర్ మార్గంలోని 4వ రూట్‌లో 20 హైస్పీడ్ రైళ్లను నడుపుతూ గురువారం పరీక్ష నిర్వహించారు. దక్షిణ రైల్వేకు చెందిన చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సోమస్ కుమార్ ద్వారా మార్గాన్ని సర్వే చేసిన తర్వాత హై–స్పీడ్ రైలు పరీక్ష జరిగింది. ఈనెల 10వ తేదీ నుంచి 4వ మార్గంలో రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నిర్వహణ పనుల కారణంగా ఎలక్ట్రిక్ రైలు సేవలను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వం తరపున 12న ఉచిత వివాహాలు
– అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి
కొరుక్కుపేట: డీఎంకే చైన్నె తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రభుత్వం తరపున ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నట్టు చైన్నె తూర్పు జిల్లా డీఎంకే కార్యదర్శి, మంత్రి పి.కె. శేఖర్‌బాబు తెలిపారు. దీనికి అర్హులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాలమేరకు పేదల ఈ ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సందర్భంగా ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు చైన్నె తూర్పు జిల్లాలో వివాహాన్ని ఉచితంగా, వేడుకగా నిర్వహించనున్నామన్నారు ఈ వేడుక ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నాయకత్వంలో జరుగుతుందని తెలిపారు. వివాహం చేసుకొనే వారి వయస్సు, ఆధార్‌కార్డు , కుటుంబ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ కార్డు వంటి పేర్లు, చిరునామాతో హార్బర్ అసెంబ్లీ కార్యాలయం, నెం. 22. నార్త్ డివిజన్ రోడ్, రాజా అన్నా కొండ గుడి ఎదురుగా , పాత తిరువళ్లువర్ బస్టాండ్ సమీపంలో నమోదు చేసుకోవాలని అభ్యర్థించారు. మరిన్ని వివరాలకు 98401 15857, 72992 64999, 90944 80356, 95516 40914 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు .
Comments
Please login to add a commentAdd a comment