ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన
తమిళనాడులోని పాఠశాలలోని విద్యార్థులకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ట్రైనింగ్ పార్కు 6వ వార్షికోత్సవ అవగాహన కార్యక్రమానికి గురువారం చైన్నెలో శ్రీకారం చుట్టింది. చైన్నెలో లక్షల మందికి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి వి. శివకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ ఆర్ విజయలక్ష్మిలు ప్రారంభించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరమ పదం ఆటను తలపించే మ్యాట్ ద్వారా ట్రాఫిక్ అవగాహన మీద దృష్టి పెట్టారు.
– సాక్షి, చైన్నె
Comments
Please login to add a commentAdd a comment