తిరువొత్తియూరు: చైన్నె నార్త్ కోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాజీ రోడ్డులో మహేష్ (30) వద్ద సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 2023లో నవీన్, విశ్వతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. అదేవిధంగా గత సంవత్సరం జనవరిలో మూర్ వీధి, ఎర్రబాలు చెట్టి వీధి కూడలి దగ్గర నడుచుకుంటూ వస్తున్న సాహుల్ హమీద్‌కు కత్తిని చూపించి సెల్‌ఫోన్ అపహరించిన అజిత్ కుమార్ అనే వ్యక్తితో పాటూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు 2024లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ 2 క్రిమినల్ కేసులకు సంబంధించి జార్జ్‌టౌనన్ లోని 7వ జిల్లా క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన విశ్వ, నవీన్, అజిత్ కుమార్ కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. దీని ప్రకారం పరారీలో ఉన్న చైన్నె నార్త్ కోస్ట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని స్పెషల్ పోలీస్ ఫోర్స్ బుధవారం సాయంత్రం విశ్వ, నవీన్ (19), అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment