తిరుత్తణి మార్కెట్‌కు కామరాజర్ పేరు పెట్టాలని వినతి
తిరుత్తణి : తిరుత్తణి మార్కెట్‌కు కామరాజన్ పేరు పట్టాలని కాంగ్రెస్ శ్రేణులు మున్సిపాలిటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. తిరుత్తణి మపోసీ రోడ్డులో 50 ఏళ్లుగా వున్న మార్కెట్ దుస్థితికి చేరుకోవడంతో కొత్త దుకాణాల సముదాయం నిర్మాణంకు రూ. 3 కోట్లు కేటాయించారు. మార్కెట్ కట్టడ నిర్మాణపు పనులు 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కొత్త మార్కెట్ సముదాయ భవనానికి కరుణానిధి శతజయంతి కట్టడంగా పేరు పెట్టాలని మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 50 ఏళ్ల చరిత్ర నిండిన తిరుత్తణి కామరాజర్ మార్కెట్ పేరు మార్చి కొత్త పేరు పెట్టేందుకు నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు త్యాగరాజన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం కమిషనర్ బాసుబ్రహ్మణ్యంను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. నూతన మార్కెట్‌కు కామరాజర్ పేరు పెట్టాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment