ఓం కాళి జై కాళీ
విమల్ పవర్ ఫుల్ పాత్రలో
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విమల్. ఇటీవల సార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ఓం కాళీ జై కాళీ. నటి బీమా విశ్వాస్, ఆర్‌ఎస్.శివాజీ, జీఎం కుమార్, కుమరవేల్, గంజాకరుప్పు, ప్రేమ, భవానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా కులశేఖర పట్టణంలో జరిగిన దసరా ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు విమల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కాళీ అవతారమెత్తిన ఆయన నటన చిత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చారని యూనిట్ వర్గాలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్,పైగా, ప్రతీకారం, సంస్కృతి ప్రధాన అంశాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాండం, కాళీ నటన, కథా, కథనం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర టీజర్‌ను జియో హాట్‌స్టార్ ఇటీవలే విడుదల చేసిందని చెప్పారు. దీనికి కార్తీక్ రాజా సంగీతాన్ని, రాము సెల్లప్పా, కమరవేల్ కథనాన్ని, రాము సెల్లప్ప సంభాషణలు అందించారు. కాగా ఈ చిత్రం నేరుగా త్వరలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment