నంగనల్లూరులో హజ్ హౌస్
సాక్షి, చైన్నె: చైన్నెలోని నంగనల్లూరులో రూ. 65 కోట్లతో తమిళనాడు హజ్‌హౌస్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను సీఎం స్టాలిన్ జారీ చేశారు. ప్రభుత్వ నేతృత్వంలో హజ్‌యాత్రకు ఏటా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నలమూలల నుంచి ఎంపికై న ముస్లింలు ఈ యాత్ర నిమిత్తం చైన్నెకు తరలి రావడం జరుగుతోంది. వీరందరికీ అన్ని రకాల వసతులతో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం నిర్ణయించారు. దీంతో తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, సభ్యుడు పి. అబ్దుల్ సమద్ సభ్యులు ఫాతిమా అహ్మద్, ఎం. డేవిడ్‌బీ, మిస్టర్. మౌలానా గులాం ముహమ్మద్ మెహదీ ఖాన్, ఎ. ముహమ్మద్ అష్రఫ్, ఎ. అఫ్జల్, కున్రంకుడి ఆర్.ఎం. అనిఫా, జిల్లా ఖాజీలు . సలావుద్దీన్ ముహమ్మద్ అయూబ్, ఎం. సయ్యద్ మసూద్, ముహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, ఫజులుల్ హక్. అబ్దుల్ ఖాదిర్, కె. అబ్దుల్ కరీం, కె.ఎం. ముహమ్మద్ అష్రఫ్ అలీ, అక్బర్ అలీలు సీఎం స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, మైనారిటీ విద్యా సంస్థలు స్టేటస్ సర్టిఫికెట్లు పొందడంతో ఇస్లామిక్ విద్యా సంస్థల నిర్వాహకులు – డా. అజార్ షరీఫ్ (మియాసి) కళాశాల), హాజీ డాక్టర్ ఎ.కె. ఖాజా నజీముద్దీన్ (జమాల్ ముహమ్మద్ మియాసి కళాశాల), తౌఫిక్ అహ్మద్ ( ఖాతీజా ఆర్ట్స్ అండ్ అండ్ సైన్సెస్ కళాశాల), డాక్టర్ సలీం (అలీం మహమ్మద్ సలీహ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్), హఫీజ్ వావు సర్ అహ్మద్ ఇషాక్ అజారి, (వావు వాజిహా మహిళల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్), డాక్టర్. ఎ. యాహ్యా నయీమ్, (మదర్ ఎడ్యుకేషన్ గ్రూప్),. అజ్మల్ ఖాన్ హౌత్, (ఐఎల్‌ఎం పబ్లిక్ స్కూల్) తదితరులు సీఎం స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎస్.ఎం. నాజర్, ఎమ్మెల్యే జవహిరుల్లా, మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. ఎస్. విజయరాజ్ కుమార్, తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీ ఎం.ఎ. సిద్ధిక్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి. కలైయరసి పాల్గొన్నారు. ఇలా ఉండగా స్టాలిన్ డీఎంకే కేడర్‌కు మీలో ఒకడిని అంటూ మరో లేఖను అందించారు. గత వారం రోజులుగా త్రిభాషా విధానంకు వ్యతిరేకంగా ఆయన కేడర్‌కు లేఖలు రాస్తూ వస్తుండడం తెలిసిందే. తాజాగా రాసిన లేఖలో రూపాయి నోటుపై ఉన్న భాషలను జాతీయ అధికార భాషగా ప్రకటించడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని చూపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తేనెతుట్టెలో వేలుపెడితే ఎంత ప్రమాదకరమో తమిళనాడు జోలికి వస్తే అదే స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment