ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌ | - | Sakshi
Sakshi News home page

ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌

Published Fri, Mar 7 2025 10:14 AM | Last Updated on Fri, Mar 7 2025 10:10 AM

ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌

ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌

తమిళసినిమా: ఏమి రైటింగ్‌. ఫెంటాస్టిక్‌. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో డ్రాగన్‌ ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, కయాడు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్‌ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్‌ ఇటీవల డ్రాగన్‌ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్‌ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌ అంటూ డ్రాగన్‌ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్‌ మారిముత్తు తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్‌ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement