హామీలు నెరవేర్చలేకే అఖిల పక్షం
– జీకే వాసన్
వేలూరు: ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చలేక డీఎంకే అఖిలపక్ష సమావేశం నిర్వహించిందని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జీకే వాసన్ తెలిపారు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 2026వ సంవత్సరంలో డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా వచ్చే పార్టీతో కూటమి పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం సమావేశంలో వివిధ తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, సారా ఏరులై పారుతోందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించడంతో ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగి పోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయలేదని పలు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పథకాలను అమలు చేయలేకనే డీఎంకే పార్టీ అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment