ఫీల్‌గుడ్‌గా 3బీహెచ్‌కే
తమిళసినిమా: సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 బీహెచ్‌కే. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 8 తోట్టాక్కళ్ చిత్రం ఫేమ్ శ్రీగణేశ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటుడు శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీథా రఘునాఽథ్, చైత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాఽథ్ సంగీతాన్ని, దినేశ్ కృష్ణన్. పీ, జిత్తన్ స్టానీస్లాస్ ద్వయం చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ ఇది ఫీల్ గుడ్ చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్ ప్రకటించగానే ప్రేక్షకుల మధ్య మంచి అంచనాలు ఏర్పడ్డాయన్నారు. మనసును ఆకట్టుకునే సంతృప్తికరమైన కథను చిత్రంగా నిర్యించడం సంతోషంగా ఉందన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ, చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. 3 బీహెచ్‌కే చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు.
సిద్ధార్థ్‌తో 3 బీహెచ్‌కే చిత్ర యూనిట్
ఫీల్‌గుడ్‌గా 3బీహెచ్‌కే
Comments
Please login to add a commentAdd a comment