అందరికీ నాణ్యమైన విద్యే లక్ష్యం
– మంత్రి అన్బిల్ మహేశ్
సాక్షి, చైన్నె : అందరికీ నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రైవేటు విద్యా సంస్థలు సహకారించాలని పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పిలుపు నిచ్చారు. దేశంలో క్యూఎస్ 1– గేజ్‌లో ఏకైక ప్లాటినం ప్లస్ పాఠశాలగా ది ప్యూపుల్ సవీత ఎకో స్కూల్ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు నాజర్, అన్బిల్ మహేశ్ హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్లాటినం ప్లస్ రేటింగ్‌ను ఆ విద్యాసంస్థకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సవీత విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ ఎన్‌ఎం వీరయ్యన్ మాట్లాడుతూ విద్యా నైపుణ్యం, విద్య పరివర్తనకు అత్యంత శక్తివంతమైన సాధనమని, పిల్లలకు తెలివితేటలు, వ్యక్తిత్వం, సృజనాత్మకతను పెంపొందించే అసాధారణమైన అభ్యాస అనుభవాన్ని అందించడం లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. ఇందుకు గుర్తింపుగా ప్లాటి నం ప్లస్ రేటింగ్ కేవలం ఒక విజయం మాత్రమే కాదని, ఇది భారతీయ విద్యకు ఒక మైలురాయి అని పేర్కొన్నారు. మైనారిటీ శాఖ మంత్రి ఎస్‌ఎం నాజర్, అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యకు విస్తృత మద్దతును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలను ప్రేరేపించి, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పినందుకు అభినందించారు. క్యూ ఎస్ నిర్వాహకులు రవిన్ నాయర్, ది ప్యీపుల్ డైరెక్టర్ డాక్టర్ సవిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment