అన్నానగర్: సినీ నేపథ్యగాయని ఇసైవాణిని ఫోన్, సోషల్ మీడియా ద్వారా బెదిరించినందుకు బీజేపీ కార్యనిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సినీ నేపథ్య గాయని ఇసైవాణి గత సంవత్సరం శ్రీఐ యామ్ సారి అయ్యప్పశ్రీ అనే పాటను పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వ్యక్తులు గాయనిని సోషల్ మీడియాలో, ఫోన్‌లో కులం పేరు పెట్టి బెదిరించారు. దీనిపై ఇసైవాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహిళలపై అఘాయిత్యం సహా 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తిరువణ్ణామలై జిల్లా వందవాసి తాలూకాకు చెందిన బీజేపీ మాజీ నాయకుడు రవిచంద్రన్ (44), పోలీచలూరు భారతీనగర్ ఇందిరాగాంధీ వీధికి చెందిన సతీష్ కుమార్ (64), సేలం జిల్లాకు చెందిన అళగు ప్రగస్పతి (24) ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి శుక్రవారం పుళల్ జైలుకు తరలించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment