పెద్దవారు ఏమైనా మాట్లాడి వెళ్లవచ్చు
వేలూరు: పెద్దవారు ఏమైనా మాట్లాడి వెళ్లవచ్చని, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్‌లో ప్రొఫెసర్ అన్బయగన్ ఐదో వర్ధంతిలో పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాట్పాడి నియోజక వర్గంలోని మగిమండలం గ్రామంలో రూ.1.60 కోట్ల వ్యయంతో చెరువు కట్ట మరమ్మతు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలోని ఆయా భాషలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడటం సరికాదన్నారు. పెద్దవారు ఏదైనా మాట్లాడి వెళ్లవచ్చని తెలిపారు. అనంతరం అమిత్‌షాపై తిరుకురల్‌లో వచనాలను మాట్లాడి వెళ్లిపోయారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, ఎమ్మెల్యే అములు, యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment