స్వయంశక్తితో మహిళలు ఎదగాలి
తిరువళ్లూరు: వుహిళలు స్వయంశక్తితో ఎదగడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ అధికారిణి నిశాంతిని సూచించారు. ఐఆర్‌సీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈకాడులో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంస్థ డైరెక్టర్ స్టీఫెన్, నిశాంతిని హాజరై ప్రసంగించారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారన్నారు. అయితే ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు స్వయంశక్తితో రాణించలేకపోతున్నారని వాపోయారు. మహిళలు పదవుల్లో వున్నా తెర వెనుక పురుషులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నపిల్లల సంరక్షణ అధికారి మలర్‌విళి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రయివేటు శాఖలకు చెందిన ఉద్యోగుల్లో మహిళల వాటా పెరిగిందన్నారు. భవిషత్తులోనూ పెరిగే అవకాశం వుందని ఆమె స్పష్టం చేశారు. అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment