● రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా
● హైకోర్టు చర్య
సాక్షి, చైన్నె: వేప్పిరిలోని ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌న్‌లో పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు సింగిల్ జడ్జి విచారించారు. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వంలో అప్పీలు దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూ ర్తులు ఆర్.సుబ్రమణియన్, జి.అరుల్ మురు గన్ తమిళనాడు ప్రైవేట్ కాలేజీల్లో థర్డ్ పార్టీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో జరిగే నియామకాలకు ప్రభుత్వ సాయం అందించాలన్నారు. కానీ పారిశుద్ధ్య కార్మికులతో సహా గ్రూప్ డి పోస్టులకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల్లో పర్మినెంట్ సిబ్బంది అధికంగా ఉండడంతో వాటిని అరికట్టేందుకు 2013లో కాంట్రాక్టు కార్మికులను నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడంతో ప్రభుత్వం అనవసరంగా ఈ అప్పీల్‌ను దాఖలు చేసిందని, ఈ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అవసరం లేకుండా అప్పీల్ చేయడంతో రూ.5 లక్షలు జరిమానా విధిస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఎంపీ దయానిధి మారన్
గెలుపు చెల్లుతుంది
– మద్రాసు హైకోర్టు తీర్పు
సాక్షి, చైన్నె: సెంట్రల్ చైన్నె నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు దయానిధి మారన్ గెలుపు చెల్లుతుందని చైన్నె హైకోర్టు తీర్పునిచ్చింది. గత 2024 లోక్‌సభ ఎన్నికల్లో మధ్య చైన్నె నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీ చేసిన దయానిధి మారన్ 2. 33 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఆయన గెలిచినట్టు ప్రకటించడం చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన న్యాయవాది ఎమ్మెల్యే రవి చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 17వ తేదీ ముగిసిన స్థితిలో ఏప్రిల్ 19వ తేది ఓటింగ్ రోజు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ పత్రికల్లో ఓ ప్రకటన చేసి ప్రచారం చేశారని, అది ప్రజా ప్రతినిధిత్వ చట్టానికి విరుద్ధమని, కనుక ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ కేసు పిటిషన్‌లో ఆరోపణలను తొలగించాలని కోరుతూ దయానిధి మారన్ తరఫున పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ పిటిషనర్ ఎల్.రవి చేసిన ఆరోపణల ఆధారంగా ఎన్నికల కేసు దర్యాప్తును కొనసాగించడం సబబు కాదని, అందువల్ల దయానిధి మారన్‌కు వ్యతిరేకంగా నమోదైన ఎన్నికల కేసును కొట్టివేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment