విద్యా సంస్థలతో ఐఐటీ ఒప్పందాలు
సేవా తత్వం
తండ్రి ఆలూరి రామస్వామి ప్రోత్సాహంతో 40 సంవత్సరాలు హిందీ, తెలుగు భాషకు తన వంతు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయిని శివకుమారి సేవాతత్వంతో అడుగులు వేస్తున్నారు. అనేక తెలుగు సంఘాలతో కలిసి తెలుగు భాషావ్యాప్తికి సేవలు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ద్వారా 20 సంవత్సరాలుగా సమాజ సేవకు కృషి చేస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అలాగే అంధులకు, మానవతా దృక్పథంతో ఆర్థిక పరంగానూ సహకారం అందిస్తున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు చేశారు. అనేక సంఘాలు ఆమె సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించాయి. – శివకుమారి
క్లుప్తంగా
సాక్షి, చైన్నె: స్వయం ప్లస్ ఉపాధి–కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమ–విద్యా సంస్థలతో ఐఐటీ మద్రాస్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సహకారాలు ఉన్నత విద్యా సంస్థలను స్వయం ప్లస్ నుంచి వారి పాఠ్యాంశాల్లోకి అనుసంధానించడానికి వీలు కల్పిస్తాయి, ఇది మూల్యాంకనాలు– ధ్రువీకరణ సహా వాటి అమలుకు కూడా తోడ్పాటు అందించనుంది. ఇండియన్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్వయం ప్లస్‌లో ఉపాధి–కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమ, ఇతర ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యార్థులు తమ విద్యాపర పాఠ్యాంశాల్లో భాగంగా ఆయా పరిశ్రమ సంబంధిత కోర్సులను తీసుకునేలా ప్రోత్సహించడానికి ఉన్నత విద్యా సంస్థలు స్వయం ప్లస్‌తో సహకరిస్తాయి. ఈ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ద్వారా, రాబోయే వారాల్లో స్వయం ప్లస్ కోర్సుల్లో చేరే 2,500 మందికి పైగా అభ్యాసకులను తొలి విడతగా చేర్చనున్నారు. వివిధ సంస్థల నుంచి 10వేల మందికి పైగా విద్యార్థుల నమోదును లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఐఐటి మద్రాస్ డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్.సారథి, ఇతర వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు గత వారం రోజులుగా జరిగాయి. ఒప్పందాల గురించి డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్.సారథి శుక్రవారం మాట్లాడుతూ, ఉన్నత విద్యా సంస్థలు తమ సెమిస్టర్ షెడ్యూల్స్‌లో స్వయం ప్లస్ కోర్సులను పొందుపరచడానికి ప్రోత్సహించడమే ఈ అవగాహన ఒప్పందాల లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కోర్సులు, వాటి మూల్యాంకనాలను పూర్తి చేసిన తర్వాత సంస్థలు ప్రోక్టర్డ్ పరీక్షలను నిర్వహిస్తాయన్నారు. దీంతో విద్యార్థులకు విద్యా క్రెడిట్‌లను ప్రదానం చేస్తారన్నారు.స్వయం ప్లస్ అనేది విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖచే ప్రారంభించిన ఒక చొరవ అని, దీని అమలుకు ఐఐటీ మద్రాస్ నోడల్ ఏజెన్సీగా నియమించారన్నారు. అధిక నాణ్యత గల అభ్యాస కంటెంట్, కెరీర్ వృద్ధికి అవకాశాలు, అభ్యాసకులు భవిష్యత్తు, సాధికారత, వృత్తిపరమైన అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఈ వేదిక లక్ష్యంగా వివరించారు. ఉన్నత విద్యా సంస్థలతో సహకారాలు స్వయం ప్లస్ కోర్సులను వారి పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి వీలు కల్పిస్తాయన్నారు. స్వయం ప్లస్ కోర్సుల అమలుకు మద్దతు ఇస్తుందన్నారు. సత్యభామ విశ్వవిద్యాలయం, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వినాయక మిషన్‌న్స్‌లా స్కూల్‌తో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు.
విద్యా సంస్థలతో ఐఐటీ ఒప్పందాలు
విద్యా సంస్థలతో ఐఐటీ ఒప్పందాలు
Comments
Please login to add a commentAdd a comment