రెండోరోజు కొనసాగిన ఈడీ సోదాలు
● త్రిభాషా వ్యవహారాన్ని రూటు మార్చేందుకే... ● ఉదయనిధి స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో పని చేస్తున్న ఐదు మద్యం ఉత్పత్తి సంస్థల్లో రెండో రోజైన శుక్రవారం కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. టాస్మాక్ కార్యాలయంలో ఈ సోదాలు కొనసాగుతుండడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం సంస్థ టాస్మాక్ సంస్థకు చైన్నె థౌజండ్ లైట్స్, టీ నగర్, పాండిబజార్, విల్లుపురం, కోవై వంటి ఐదు మద్యం తయారీ సంస్థల నుంచి అధికంగా మద్యం కొనుగోలు జరిగి ఉన్నాయి. అలాగే ఈ సంస్థ నుంచి కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాలకు కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గత అన్నాడీఎంకే హయాంలో ఈ 5 మద్యం కంపెనీలు కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఆ మేరకు గత ఆదాయ పన్ను శాఖ అధికారులు 2019లో ఆరోపణలు ఎదుర్కొన్న ఏఏజే, కాల్స్ మద్యం కంపెనీలపై దాడులు నిర్వహించగా, మద్యం విక్రయాల ద్వారా రూ.450 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారులు అందించిన సమాచారం మేరకు ఎనన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. టాస్మాక్‌కు మద్యం విక్రయించేందుకు అత్యధికంగా డబ్బును అక్రమంగా మద్యం తయారీ కంపెనీలకు తరలించినట్లు సమాచారం. ఈ 5 మద్యం కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగడం ఆ శాఖల్లో కలకలం రేపింది.
త్రిభాషా వ్యవహారాన్ని రూటు మార్చేందుకే...
– ఉదయనిధి స్టాలిన్
రాష్ట్రాభివృద్ధి పథకాల గురించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఒక్కొక్క జిల్లాకో పరిశీలన జరుపుతూ వస్తున్నారు. ఆ మేరకు తిరువారూరులో గురువారం పరిశీలన జరిపిన ఉదయనిధి రాత్రి సన్నధి వీధిలో బస చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు తిరువారూర్‌లో జరిగిన అన్ని ప్రభుత్వ శాఖల పరిశీలన సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ త్రిభాషా విధానం వ్యవహారం, రాష్ట్రానికి నిధుల విడుదల వ్యహారాలను రూటు మార్చేందుకే ప్రస్తుతం రాష్ట్రంలో ఈడీ సోదాల డ్రామా అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment