తిరువొత్తియూరు: ఢిల్లీకి చెందిన ఓ మహిళ చైన్నె అన్నానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రీతి (21), ఆమె భర్త వీణై యాదవ్ (32) హరియాణాకు చెందినవారు. వీరిద్దరూ నెల రోజులుగా చైన్నెలోని అన్నానగర్ 6వ వీధిలోని వై–బ్లాక్ ఫ్లాట్ 2వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వీణాయాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత అపార్ట్‌మెంట్ మేనేజర్‌కు ఫోన్ చేసి తన భార్య ఇంట్లో అనారోగ్యంగా ఉంది. ఇంటికి వెళ్లి– చూడుశ్రీ అని చెప్పాడు. వెంటనే మేనేజర్ అక్కడికి వెళ్లి వీణాయాదవ్ ఇంటి తలుపు తట్టాడు. తెరవలేదు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రీతి ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. అన్నానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె గదిలో తనిఖీ చేశారు. అందులో ఆమె ఏదైనా లేఖ రాశారా ? సెల్‌ఫోన్‌న్ స్వాధీనం చేసుకుని చివరిగా మాట్లాడిన భర్త గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.
ముదుమలై ఫారెస్ట్‌లో పులి మృతి
అన్నానగర్: నీలగిరి జిల్లా పందలూరు తాలూకాలోని ముదుమలై టైగర్ రిజర్వ్ పరిధిలోని నేలకొట్టై అటవి రేంజర్ ఎడకోడ్ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం అటవీశాఖ గస్తీ నిర్వహించింది. అప్పుడు అడవిలో ఒక పులి మృతిచెంది ఉంది. ఇది గమనించిన అటవీశాఖాధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పశు వైద్యులు వచ్చి పులి కళేబరానికి శవపరీక్ష నిర్వహించారు. అటవీశాఖ తెలిపిన వివరాల మేరకు మృతిచెందింది పదేళ్ల మగపులి అని తెలిపారు. అయితే పులి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ముఖ్యౖ మెన శరీర భాగాలను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment