సాక్షి, చైన్నె: రాష్ట్ర శాసనసభలో గత డిసెంబర్‌లో తమిళనాడులోని ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధింపునకు సంబంధించి బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించారు. ఈ చట్టం లిగ్నైట్, లైమ్‌స్టోన్, మాగ్నసైట్, క్యారియం వంటి 13 రకాల ఖనిజాలను ప్రధాన రకాలైన ఖనిజాలు, నల్లరాయి, కంకర లేదా నేల, రంగు, నలుపు పొట్టు, గులకరాళ్లు, ఇసుక, క్వార్ట్‌జైట్, బంకమట్టి నేల, రోల్డ్ క్లే నేల, బంకమట్టి, నది ఇసుక వంటి వాటిని వర్గీకరిస్తుంది. పిండి చేసిన రాయి, సున్నపురాయి సహా 17 ఖనిజాలు చిన్న ఖనిజాలుగా వర్గీకరించబడ్డాయి. దీని ప్రకారం ఖనిజాలకు టన్నుకు రూ.40 నుంచి రూ.7వేలు, చిన్న ఖనిజాలకు రూ.40 నుంచి రూ.420 వరకు పన్నుగా నిర్ణయించారు. ఈ సందర్భంలో గవర్నర్ రవి ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు తమిళనాడులోని 28 జిల్లాల్లో పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల్లో వ్యక్తిగత అధికారుల నియామకానికి సంబంధించిన బిల్లుకు కూడా గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులు ఆమోదం గెజిట్‌లో ప్రచురించారు.
నేడు అంతర్జాతీయ
మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నాయి. ఇందులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో శనివారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి పాల్గొని 77 కేజీల కేక్‌ను కట్ చేయనున్నారు. మాజీ మంత్రి పి.వలర్మతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగనున్నాయి. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు చైన్నె మైలాపూర్ సీఐటీ కాలనీలోని 3వ మెయిన్ రోడ్డులోని తమాకా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రసంగించి అన్నదానం చేయనున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సంఘాలు మహిళా దినోత్సవం జరుపుకోనున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment