పేదల డాక్టర్
నెల్లూరు టౌన్‌కు చెందిన డాక్టర్ శాలిని. విశాఖలో బీహెచ్‌ఎంఎస్ పూర్తిచేసి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రణీత్‌వర్మతో వివాహం తరువాత తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో స్థిరపడి పెత్తికుప్పంలో డాక్టర్ వర్మ క్లినిక్ పేరిట వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలను అందిస్తూ పేదల డాక్టర్‌గా ముద్రపడ్డారు. దీంతో పాటు ఇప్పటివరకు గత ఆరు సంవత్సరాల కాలంలో 50కి పైగా ఉచిత మెడికల్ క్యాంపులు, గుమ్మిడిపూండి సిప్‌కాట్‌లో కార్మికుల కోసం ప్రతినెలా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులను అందజేస్తున్నారు. దీంతో పాటు గుమ్మిడిపూండిలోని నిరాశ్రయుల ఆశ్రమంలోని విద్యార్థులకు ప్రతి ఏటా దుస్తులు, మందులు సైతం అందజేస్తున్నారు. డాక్టర్ శాలిని వైద్యురాలే కాదు..మంచి మనసున్న సామాజిక కార్యకర్త కూడా.
–డాక్టర్ శాలిని
Comments
Please login to add a commentAdd a comment