అందరికీ ఆదర్శంగా..
వేలాది మంది విద్యార్థులు చదివే వేల్‌టెక్ వర్సిటీకి మేనేజింగ్ ట్రస్టీగా విధులు నిర్వహిస్తూ సమాజం, సీ్త్రల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రంగరాజన్ మహాలక్ష్మి. ఈమె తిరుపతికి చెందిన డాక్టర్ శకుంతల, రంగరాజన్ దంపతుల కుమార్తె. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి పీహెచ్‌డీ సైతం పూర్తి చేశారు. డాక్టర్ శకుంతల మరణాంతరం వేల్‌టెక్ వర్సిటీ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా స్వీకరించిన మహాలక్ష్మి, సంస్థను నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేద మహిళలకు ఆర్థికంగా భరోసానిస్తూ ఆందరి వద్ద ప్రశంసలు పొందుతున్నారు. వేల్‌టెక్ వర్సిటీ నిర్వాహణలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్న మహాలక్ష్మి ఆడబిడ్డే కాదు, అందరి బిడ్డగా మన్నలనూ పొందుతున్నారు.
– రంగరాజన్ మహాలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment