ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘పెరుసు’
కాళిదాస్ – 2 చిత్ర ఫస్ట్ లుక్ విడుదల
తమిళసినిమా: నటుడు వైభవ్, సునీల్ రెడ్డి, నటి నిహారిక ప్రధాన పాత్రలు నటించిన ఇందులో చాందిని తమిళరసన్, నటుడు కరుణాకరన్, బాలా సరవణన్, మునీష్ కాంత్, కింగ్ స్లీ ,దిపా శంకర్, ధనలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ, బవేజా స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఇళంగోరామ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పెరుసు చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరు, కథారచయిత కార్తీక్ సంతానం మాట్లాడుతూ మంచి లేటెస్ట్ కంటెంట్‌తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాలనే తాము నిర్మిస్తామని చెప్పారు. ఈ పెరుసు చిత్రం ఈ కోవకే చెందుతుందని చెప్పారు. ఇది ఏ సర్టిఫికెట్ చిత్రమే అయినా ఎలాంటి వల్గారిటీ లేని డార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు ఇళంగో రామ్ చాలా జనరంజకంగా తెరకెక్కించానని చెప్పారు. నటుడు వైభవ్ మాట్లాడుతూ ఓ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని చెప్పారు. అది కుటుంబ సభ్యులకు సీరియస్‌గా ఉన్నా ప్రేక్షకులకు జాలీగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఆ సంఘటనను ఆ కుటుంబంలోని అన్నాదమ్ములు ఎలా ఎదుర్కన్నారు అన్నదే పెరుసు చిత్రం అన్నారు. గతంలో వచ్చిన ఆంబావం, మైకెల్ మదన కామరాజ్ వంటి కల్ట్ కామెడి కథా చిత్రాలీ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆ చిత్రాలతో పోల్చక పోయినా, మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. నటుడు వైభవ్ కామెడీ యాక్టింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుందని,ఈ చిత్రంలో ఆయన చాలా బాగా నటించారని చెప్పారు. దీనికి అరుణ్ సంగీతాన్ని, సుందర మూర్తి నేపథ్య సంగీతాన్ని, సత్య ఛాయాగ్రహణం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో శక్తి ఫిలిమ్స్ శక్తివేల్ విడుదల చేస్తున్నారు.
తమిళసినిమా: నటుడు భరత్ కథానాయకుడిగా నటించిన చిత్రం కాళిదాస్, శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019 లో విడుదలై కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో పాటూ మంచి ప్రశంశలు అందుకుంది. కాగా తాజాగా దానికి సీక్వెల్‌గా కాళిదాస్– 2 రూపొందుతోంది. ఇందులో భరత్‌తో పాటూ వర్ధమాన నటుడు అజయ్ కార్తీక్ కథానాయకుడిగా నటించారు. నటుడు ప్రకాష్ రాజ్, ఆడుగళం కిశోర్, సురేష్ మీనన్, ఆనంద్ నగర్, భవానీ శ్రీ, అపర్ణది, రాజా రవీందర్, టీఎం.కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా పూవే ఉనక్కాగా చిత్రం ఫేమ్ సంగీత ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. కాగా కాళిదాస్ చిత్రం ఫేమ్ శ్రీ సెంథిల్ నే దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్ సెంథిల్ తనకు చెందిన స్కై పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు విజయ్ సేతుపతి శనివారం తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసి, యూనిట్ సభ్యులను అభినందించారు..ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వివరాలను తెలుపుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. షూటింగ్‌ను చైన్నె, కేరళా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. కాళిదాస్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దానిని సీక్వెల్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటి సంగీత బలమైన కథా పాత్రను పోషించినట్లు చెప్పారు. ఇది ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్సీఫీరియన్స్‌ను ఇస్తుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, సురేష్ బాలా ఛాయాగ్రహణం అందించారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘పెరుసు’
Comments
Please login to add a commentAdd a comment