మహిళా విద్యకు అధిక నిధులు కేటాయించాలి
వేలూరు: మహిళా విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా చాన్స్‌లర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మహిళలు ముఖ్య భాగం వహిస్తున్నారన్నారు. మహిళలకు విద్య అందజేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని ఒక మహిళ విద్యావేత్త అయితే కుటుంబమే కాకుండా సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. దీంతోనే వీఐటీలో మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వీఐటీలో వైస్ చాన్స్‌లర్, రిజిస్టార్ కూడా మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోని పది దేశాల్లో మాత్రమే 50 శాతం మంది మహిళలు పార్లమెంట్‌లో ఉన్నారని మన దేశంలో 14 శాతం మహిళలు మాత్రమే అధికారంలోకి రాగలుగుతున్నారన్నారు. చైన్నె హైకోర్టు న్యాయమూర్తి భవానీ సుబ్బరాయన్ మాట్లాడుతూ ఆడ పిల్లలకు చిన్న వయస్సు నుంచే మంచి చెడులను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై తెలియజేయగలిగితే కొంత వరకు ఆడ పిల్లలను నేరాల నుంచి కాపాడ వచ్చాన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను వేధించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని వీటిలో కులం, రంగు, ఎత్తు అనే తారతమ్యం ఉండ కూడదన్నారు. ఒకప్పడు మహిళలు సైకిల్ తొక్కడానికి కూడా వీలు ఉండేది కాదని ప్రస్తుతం కల్పనా చావ్లా నుంచి సునీతా విలియమ్స్ వరకు అంతరిక్షంలోకి వెళ్లారన్నారు. సమాజంలో సీ్త్ర, పురుషులు సమానమని ఇద్దరూ కలిసి ఉంటేనే జీవితం సంతోషంగా సాగుతుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, నిర్వాహక డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, రిజిస్ట్రార్ జయభారతి, ప్రొ చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, వైస్ చాన్స్‌లర్ కాంచన పాటూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment