మూడో ప్రపంచ యుద్ధం ఇతివృత్తంతో ‘రెడ్ ప్లవర్’
తమిళసినిమా: పిరియడ్ కథలతోనే కాదు, ప్యూచర్ కథలతోనూ వైవిధ్యభరిత కథా చిత్రాలు రూపొందుతున్నాయి. అలా 2047లో మూడవ ప్రపంచ యుద్ధం ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం రెడ్ ప్లవర్. శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కే.మాణిక్యం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. నటుడు విఘ్నేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి మనీషా జాస్నవి నాయకిగా నటిస్తున్నారు. నాజర్, వైజీ. మహేంద్రన్, సురేశ్‌మీనన్, జాన్‌విజయ్, అజయ్ రత్నం, లీలాసామ్సన్, టీఎం.కార్తీక్, గోపీ కన్నదాసన్, తలైవాసల్ విజయ్, మోహన్‌రామ్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆండ్రూ పాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సైన్స్‌ఫిక్షన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 2047లో మూడవ ప్రపంచ యుద్ధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు అదరపు బలంగా ఉంటాయన్నారు. దేశభక్తి, ఇద్దరు సహోదరుల మధ్య ద్రోహం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో 4 పాటలు ఉంటాయని, చిత్ర ఆడియో హక్కులను సరిగమ సంస్థ పొందినట్లు చెప్పారు. కాగా త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
రెడ్‌ప్లవర్ చిత్రంలో విఘ్నేశ్, మనీషా జాహ్నవి
Comments
Please login to add a commentAdd a comment