విద్యా సామాగ్రి వితరణ
తిరవళ్లూరు: ప్రభుత్వ పాఠశాలకు రూ. 4 లక్షల విలువ చేసే వస్తువులను పీఎంకే యూనియన్ మాజీ కౌన్సెలర్ నేతృత్వంలోని స్థానికులు అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగత్తూరు కండ్రిగలో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు సుమారు రెండువందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో పాఠశాల వార్షికోత్సవం శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక మాజీ కౌన్సిలర్ పీఎంకే నేత వెంకటేషన్ పాఠశాలకు రెండు లక్షల రూపాయలు విలువ చేసే రెండు ఏసీలు, ఫ్యాన్, కంప్యూటర్, టేబుల్స్, కుర్చీలను వితరణగా ఇచ్చారు. దీంతో పాటూ మరో కంపెనీ లక్ష రూపాయలు విలువ చేసే టీవీని అందజేసింది. మొత్తానికి స్థానికులు ప్రభుత్వ పాఠశాలకు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను అందించారు. అనంతరం 32 మంది ఒకటవ తరగతి విద్యార్దులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇసక్కియమ్మాల్, పీఎంకే రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బాలయోగి, మాజీ సర్పంచ్‌లు సునీతబాలయోగి, మోహనసుందరం, మాజీ జెడ్పీటీసీ దినేష్‌కుమార్, మాజీ యూనియన్ కౌన్సిలర్‌లు యోగనాథన్, ద్రావిడభక్తన్‌తో పాటూ పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment