పనుల్లో నాణ్యత లోపిస్తే లైసెన్స్ రద్దు
తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేస్తామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మీంజూరు షిప్‌యార్డు నుంచి నిత్యం వేలాది వాహానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కంటైనర్ వాహనాలు సిటీలోకి రావడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో ఔటర్ రింగ్ రోడ్డును మీంజూరు షిప్‌యార్డు నుంచి మహాబలిపురం వరకు నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 133 కిమీ మేరకు రూ.2,122 కోట్ల వ్యయంతో మూడుదశలో సాగే నిర్మాణపు పనులు, ప్రస్తుతం మీంజూరు నుంచి ఒదికాడు వరకు పూర్తయ్యింది. రెండవదశ పనులు ఒదికాడు నుంచి శ్రీపెరంబదూరు వరకు వేగంగా సాగుతున్నాయి. ఈక్రమంలో మీంజూరు వద్ద 1.8 కిమీ మేరకు జరుగుతున్న ప్లైఓవర్ బ్రిడ్జీ నిర్మాణపు పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న కలెక్టర్, సంబంధిత పనులు నాణ్యతగా వుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment