
తెలుగులోగిళ్లలో మహిళా సంబరాలు
కొరుక్కుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని తెలుగు సంఘాలు, కళాశాలలు, చర్చిల్లో కోలాహలంగా జరుపుకున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిభ చాటిన మహిళలను ఘనంగా సత్కరించుకున్నారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ది వాటర్బరి సంఘంలో..
ది వాటర్బరి మెమోరియల్ తెలుగు బాప్టిస్టు సంఘం సీ్త్రల సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దిన వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. వాటర్‌బరీ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని జాన్‌వెస్లీ అంతర్జాతీయ మినిస్ట్రీకి చెందిన సహోదరి బెస్లీ జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆయా రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సీ్త్రల సమాజం అధ్యక్షురాలు బిందు పుల్లా , కార్యదర్శి కే.రీతా ప్రభాకర్, కోశాధికారి కె.రాణి, ఉపాధ్యక్షురాలు ఎన్.బి విజయభాస్కర్, సహాయ కార్యదర్శి ఈ.ప్రభావతి నేతృత్వంలో జరిగిన మహిళా దినోత్సవంలో 300 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 40 మంది మహిళలను గౌరవించారు.
ఎస్‌కేపీసీలో..
చైన్నె జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) 26వ కళాశాల దినోత్సవంతోపాటు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కన్యాబజార్ కార్యక్రమాలను శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిల సాంస్కతిక ప్రదర్శనలు, బహుమతుల పంపిణీ, అతిథులు ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌కేపీ కన్వెన్షన్ హాలు వేదికగా సాగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, సరస్వతి ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రియదర్శిని రాజ్‌కుమార్ పాల్గొని, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. కన్యా బజార్ ప్రదర్శనలో ఆహారం, దుస్తులు, ఉపకరణాలను అందించే విభిన్న స్టాళ్ల ద్వారా ప్రతిభను చాటుకున్నారు. ప్రిన్సిపల్ ఇన్‌చార్జ్ డాక్టర్ పీబీ వనిత సారధ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహన శ్రీ, ట్రస్టీలు దేసులక్ష్మీనారాయణ, ఎస్ ఎల్ సుదర్శనం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసీటీబీసీలో..
మద్రాసు సెంటినరి తెలుగు బాప్టిస్టు సంఘము (ఎంసీటీబీసీ) సీ్త్రల సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె, వేపేరిలోని మద్రాస్ సెంటెనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన దైవ ప్రసంగీకులు సిస్టర్ షేకీనా గ్లోరీ పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. సీ్త్రల సమాజం అధ్యక్షురాలు ఎస్. దానమ్మ, కార్యదర్శి రూతమ్మ, కోశాధికారి ఎం.రాణి, సువార్తికులు కె దీనమ్మ, జె.జయమ్మ కలసి అతిథి సిస్టర్ షేకీనా గ్లోరీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంఘ అధ్యక్షులు జి.రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాసు , కోశాధికారి ఐ.మార్క్ లు పర్యవేక్షించారు.

తెలుగులోగిళ్లలో మహిళా సంబరాలు

తెలుగులోగిళ్లలో మహిళా సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment