ఆరోగ్య సంరక్షణకు చైన్నెలో హోమ్ కేర్ సేవలు
సాక్షి, చైన్నె : రోగుల ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్యమే లక్ష్యంగా హోమ్ కేర్ సేవలకు గ్లెనిగల్స్ ఆస్పత్రి శనివారం శ్రీకారం చుట్టింది. ఈ కొత్తసేవ మేరకు అత్యవసరం లేదా, వైద్య సంరక్షణ అవశ్యంగా ఉన్న వారికి వైద్యుల బృందాలు ఇళ్ల వద్దకే వెళ్లి సేవలను అందించనున్నాయి. కలైమామణి నటి నళిని శనివారం చైన్నెలో హోమ్‌కేర్ సేవలను ప్రారంభించారు. ఇంటర్నల్ మెడిసిన్ – డయాబెటాలజీ విభాగం హెచ్‌ఓడీ – సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వి.అశ్విన్ కరుప్పన్ సమక్షంలో గ్లెనీగల్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నాగేశ్వర్‌రావు కె ఈ సేవ గురించి వివరించారు. ఈ గృహ సంరక్షణ సేవ, ల్యాబ్, రేడియోలాజికల్ పరీక్షలు, వైద్యులు, నర్సులు, ఫిజియో థెరపిస్టులు, వైద్యసంబంధిత పరికరాలు, వినియోగ వస్తువులు, ఇతర ప్రత్యేక అంశాలతో కూడిన వస్తువులు, రోగుల అవసరాలన్నింటినీ ఒకే చోట అందించే విధంగా ఉంటాయన్నారు. శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధి నిర్వహణతో సహా సకాలంలో ప్రభావవంతమైన సంరక్షణను నిర్ధారించడానికి గృహ సంరక్షణ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఇందుకోసం వైద్యులు, నర్సులు, వైద్య నిపుణుల ప్రత్యేక బృందం సిద్ధంగా ఉంటుందన్నారు. చైన్నెలోని రోగులు, వారి కుటుంబాలు ఈ హోమ్ కేర్ సర్వీసెస్‌ను 044 – 44777000 నంబర్‌లో సంప్రదించడం ద్వారా పొందవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment