మీకు జోహార్లు!
ఆడాళ్లు..
అవార్డులు..
పింక్ ఆటోలను జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్
సామాజిక సంస్కరణ, మహిళా అభివృద్ధి, మత సామరస్యం, భాషా సేవ, కళ, సైనన్స్, సంస్కృతి, జర్నలిజం, పరిపాలన సహా వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు తలా రూ. ఒక లక్ష చెక్కు, రూ. 50 వేలు విలువైన బంగారు పతకం, సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డులకు ఈ ఏడాది మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యశోద షణ్ముగసుందరంకు 2025 సంవత్సరానికి ఆవైయార్ అవార్డును ముఖ్యమంత్రి ప్రదానం చేశారు,
కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్ కు చెందిన కె. సౌమ్యకు రాష్ట్ర బాలికా సంరక్షణ దినోత్సవ అవార్డును అందజేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ కలై సెల్వి మోహన్ కూడా రాష్ట్ర బాలికా సంరక్షణ దినోత్సవ అవార్డు అందజేశారు. మహిళలు మరియు పిల్లలపై నేరాలను ఎదుర్కోవడానికి మహిళా పోలీసు దర్యాప్తు అధికారులు, డిటెక్టివ్‌లకు నైపుణ్యాలు పోలీస్ విభాగంలో నిపుణులు, రాష్ట్ర నేర రికార్డుల బ్యూరో తదితర విభాగాలలో సేవలు అందిస్తున్న మహిళా అధికారులకు పతకాలను అందజేశారు. మహిళా పోలీసుల సాహస ప్రదర్శనలు, విద్యార్థుల కళాత్మక ప్రదర్శనలకు సత్కారాలు జరిగాయి. ముందుగా, క్యారమ్ క్రీడాకారిణి కాసిమా, కళాకారిణి, మహిళా హక్కుల ప్రాజెక్టు లబ్ధిదారు జె. ఎలిజబెత్, మహిళల స్వయం సహాయం కమిటీ సభ్యురాలు నిర్మల, విద్యార్థిని భవాని ఉన్నత విద్య స్కాలర్‌షిప్‌ను అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మొత్తంగా రూ. 3200కోట్లు విలువగల సహాయకాలను అందజేశారు. అలాగే కాంచీపురం, ఈరోడ్, ధర్మపురి, శివగంగ, తేని, కడలూరు, నాగపట్నం, రాణి పేట,కరూర్‌లలో రూ. 72 కోట్లతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి తీసుకున్న చర్యలను సీఎం ప్రకటించారు.
సాక్షి, చైన్నె : చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ మహిళా సంక్షేమ శాఖ నేతృత్వంలో జరిగింది. ఇందులో మహిళలకు గుర్తింపుకల్పించే విధంగా, సహకారం అందించే రీతిలో కార్యక్రమాలు, అవార్డులు, సత్కారాలు జరిగాయి. ముందుగా మహిళలకు ప్రయాణంలో భద్రత కల్పించే విధంగా చైన్నెలో పింక్‌ఆటో సేవలకు శ్రీకారం చుట్టారు. మహిళా సంక్షేమ శాఖ నేతృత్వంలో రూ. 2.41 కోట్లతో 50 ఈ ఆటోలను కొనుగోలు చేశారు. కార్మిక సంక్షేమ శాఖ నేతృత్వంలో రూ. లక్ష చొప్పున సబ్సిడీతో 100 పింక్ ఆటోలు, మరో 100 సాధారణ ఆటోలను కొనుగోలు చేశారు. ఇందులో పింక్ ఆటోలు పూర్తిగా మహిళలు, బాలికల రక్షణ లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 250 ఆటోలను పూర్తిగా మహిళ డ్రైవర్లే నడుపుతారు. ఈ ఆటోలకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు. ఈ ఆటోలలో చట్టాలు, సమాచారం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అనంతరం 1000 మహిళా స్వయం సహాయక సంఘాలకు గుర్తింపు కార్డులను సీఎం అందజేశారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా గ్రామీణ, నగర బస్సులలో ప్రయాణించవచ్చు. సహాయ బృందాలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులో 25 కిలోల వరకు డెలివరీ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య భీమా పథకం ప్రయోజనాలు, సహాకార బ్యాంక్‌ల ద్వార వివిధ రునాల పొదడంలో ప్రాధాన్యత, తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నన్నీలం మగళిర్ భూమి ప్రాజెక్టును అమలు చేస్తూ చర్యలు తీసుకున్నారు. అలాగే,విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహిళా విద్యార్థులకు విద్యా సహాయం..
మొత్తంగా ఆది ద్రావిడ , గిరిజన సంక్షేమ శాఖ తరపున. ఐదుమందికి రూ. 3.50 కోట్ల విద్యా స్కాలర్‌షిప్‌లను ప్రకటించి అందజేశారు. తమిళనాడు నిర్మాణ కార్మికుల సంక్షేమ శాఖ తరపున 40 మంది మహిళా కార్మికులకు తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ద్వారా గృహ కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. నాన్ మోదల్వన్‌పథకం మేరకు శిక్షణ పొందిన ముత్తు రత్న, జె. నిరంజన, ఎస్ వర్షిణిలకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, ఈ సేవాకేంద్రాలలో మహిళకు 10 శాతం సేవా చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని ప్రకటించారు.
సీ్త్రలు లేకుంటే పురుషులు లేరు..
సీఎం స్టాలిన్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మార్చి ఒకటిన జరిగిన తన పుట్టిన రోజు, మార్చి 8న జరుపుకుంటున్న మహిళా దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ, సీ్త్రలు లేకుంటే పురుషులు లేరని వ్యాఖ్యానించారు. ద్రవిడ ఉద్యమం ప్రాథమిక లక్ష్యం రక్త, లింగ భేదం లేకుండా పూర్తి సామాజిక న్యాయంతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా హక్కులు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల గురించి ఈసందర్భంగా ప్రస్తావించారు. అన్ని రంగాలలో మహిళలను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కట్టడి, బాల్య వివాహాలను నిరోధించడం, స్వయం సహాయక బృందాలకు రుణ ప్రోత్సాహం, వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టళ్ల నిర్మాణాలను వివరించారు. ప్రస్తుతం మహిళలకు భద్రత కల్పించే విధంగా పింక్‌ఆటో సేవలకు శ్రీకారం చుట్టామని పేర్కొంటూ, ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకంలో నమోదు,సహకార బ్యాంకుల ద్వారా వివిధ రుణాలలో ప్రాధాన్యత , కో ఆప్ టెక్స్, ఆవిన్ ఉత్పత్తుల్లో మహిళ పాత్రను వివరించారు. ద్రవిడ మోడల్ ప్రభుత్వంలో మహిళల కోసం మరిన్ని పథకాల అమలుకు పరిశీలన జరుపుతున్నట్టు తెలిపారు. అన్ని ప్రణాళికలు మహిళల కోసమేనా, అని పురుషులు ప్రశ్నించే విధంగా పథకలను అమలు చేస్తున్నామన్నారు. ప్రేమ, దయ, ధైర్యం, జ్ఞానం ప్రతి సీ్త్రకి అలంకారణలో పేర్కొంటూ జ్ఞానం, ధైర్యం గుర్తింపుగా మారాలని ఆకాంక్షించారు. ప్రతి సీ్త్రలోనూ అమూల్యమైన శక్తి ఉంటుందని, ప్రపంచం మీదే.. విజయాలు కొనసాగిద్దాం...కొనసాగిద్దాం అని ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్, మంత్రులు గీతాజీవన్, ఎం. సుబ్రమణియన్, శేఖర్‌బాబు, సీవీ గణేషన్, కయల్వెలి సెల్వరాజ్, మేయర్ ప్రియ, ఎంపీలు తమిళచ్చి తంగపాండియన్, కనిమొళి సోము, కళానిధి వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు మహిళా దినోత్సవం సందర్భంగా కామరాజర్ సాలైలోని అవ్వయార్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళులు అర్పించారు.
ప్రతి సీ్త్రలోనూ అమూల్యమైన శక్తి
ప్రపంచం మీదే.. విజయాలు కొనసాగిద్దాం..
మహిళా దినోత్సవ వేడుకలో సీఎం స్టాలిన్ వ్యాఖ్య
అబలకు భద్రతగా పింక్ ఆటో సేవలకు శ్రీకారం
ఉత్తమ సేవకులకు అవార్డులు, సత్కారం
మీకు జోహార్లు!
మీకు జోహార్లు!
మీకు జోహార్లు!
Comments
Please login to add a commentAdd a comment