తూత్తుకుడి సముద్రంలో టెన్షన్.. టెన్షన్
సేలం : తూత్తుకుడి నుంచి మాల్‌ద్వీపానికి చిన్న రకం పడవలో అక్రమంగా తరలించిన రూ. 33 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తూత్తుకుడి నుంచి సముద్ర మార్గంలో శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలకు మత్త పదార్థాలను అక్రమగా తరలించడం అలవాటుగా మారింది. దీనిపై కేంద్ర రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు నిఘాపెట్టారు. ఈ స్థితిలో గత మార్చి 4వ తేదీ తూత్తుకుడి నుంచి సముద్ర మార్గంలో మాల్దీవులకు మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో అధికారులు తూత్తుకుడి పాత హార్బర్‌కు వెళ్లి నిఘా చేపట్టారు. అప్పుడు మల్దీవుల వైపుగా నల్ల చలువ రాళ్ల లోడ్‌తో వెళ్లిన పార్జర్ అని పిలువబడే చిన్న రకం ఓడపై అధికారలకు సందేహం ఏర్పడింది.
సినీ ఫక్కీలో ఛేజింగ్..
వెంటనే పాత హార్బర్ నుంచి బయలుదేరిన పార్జర్‌ను అడ్డుకుని నిలిపేవయాలని సముద్ర తీర భద్రతా భలగాలకు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగ అధికారులు తెలిపారు. ఆ మేరకు నడి సముద్రంలో వెళుతున్న పార్జర్ ఓడను సముద్రతీర భద్రతాధికారులు వెంటాడారు. ఇది గమనించిన అక్రమ రవాణాదారులు ఓడ వేగాన్ని పెంచారు. అయితే కేంద్ర బృందాలు ఛేజింగ్ చేసి ఆ ఓడను అడుకుని నిలిపారు. తర్వాత ఆ ఓడను సముద్రతీర భద్రతా దళం తూత్తుకుడి హార్బర్‌కు తరలించారు. అనంతరం అందులో కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు జరిపిన సోదాలలో 16 పార్సిళ్లలో అత్యంత ఘాటైన మత్తు పదార్థాం హసీష్ అనే గంజాయి నూనె 30 కిలోలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ పార్సిళ్లలో ఉన్న 30 కిలోల గంజాయి నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ స్థాయిలో దీని విలువ రూ.33 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ గంజాయి నూనెను అక్రమంగా తరలిస్తున్న ఓడలో పని చేస్తున్న తూత్తుకుడి, ఆలంతలైకు చెందిన క్లిప్టన్, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన తెన్‌కాశి జిల్లాకు చెందిన నవమణి అనే ఇద్దరిని ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారి ఇద్దరి ఇళ్లలోను అధికారులు సోదాలు జరిపారు. అధికారులు క్లిప్టన్, నవమణితోపాటూ 11 మందిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. దీంతో తూత్తుకుడి సముద్రంలో శనివారం టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఓడలో రూ.33 కోట్ల మత్తు పదార్థాలు అక్రమ రవాణా
సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్న కేంద్ర బలగాలు
ఇద్దరు సిబ్బంది, సహా 11 మంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment