నేటి నుంచి పుదుచ్చేరి అసెంబ్లీ
– 12న బడ్జెట్ దాఖలు
సాక్షి, చైన్నె: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 12వ తేదీన అసెంబ్లీలో సీఎం రంగస్వామిబడ్జెట్ దాఖలు చేయనున్నారు. పుదుచ్చేరిలో గవర్నర్ ప్రసంగం,బడ్జెట్ దాఖలు సమావేశం ఒకేసారి నిర్వహించడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ దిశగా ఈఏడాదిలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ దాఖలు నిమిత్తం సోమవారం సభ ప్రారంభంకానుంది. తొలిరోజున లెఫ్టినెంట్ గవర్నర్ కై లాస్ నాథన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తదుపరి రోజు ధన్యవాదుల తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈనెల 12వ తేదీన సభలో సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేయనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా దాఖలు కాబోతున్న తుది పూర్తిస్థాయి బడ్జెట్‌గా ఇది నిలువనుంది. దీంతో బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే సీఎం రంగస్వామిసమగ్ర పరిశీలన జరిపి ఉన్నారు. కొత్త వాగ్దానాలు,ప్రకటనలు బడ్జెట్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలనుసూచన ప్రాయంగావెల్లడించేఅవకాశాలు ఉన్నాయి. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినానంతరం తొలిసారిగా అసెంబ్లీలో ఎల్జీ కై లాస్‌నాథన్ ప్రసంగించబోతున్నారు. అదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వ మిత్ర పక్షం బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, వారి మద్దతు స్వతంత్ర ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ ఎన్బలం సెల్వం మీద గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. గత సమావేశాలలో ఆయనపై ఏకంగా అవిశ్వాస తీర్మానం నోటీసును వీరు ఇచ్చారు. దీనిని తిరస్కరించిన సీఎం రంగస్వామి విశ్వాస పరీక్ష ద్వారా స్పీకర్‌ను గెలిపించుకున్నారు. ఈ వివాదం తాజా సమావేశాలలో సైతం కొనసాగే అవకాశాలుఉన్నాయి. ప్రభుత్వంలోనే వివాదాలు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, అనేక వాగ్దానాలు అమలుకు నోచుకోకుండా చేస్తూ వస్తున్న పుదుచ్చేరి పాలకులకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు తొలిరోజు సభలో నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment