ఏప్రిల్‌లో తెరపైకి రాజపుత్రన్
తమిళసినిమా: నటుడు ప్రభు, వెట్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రాజపుత్రన్. కణంలో కథనాయకుడిగా నటిస్తున్న కోమల్ కుమార్ ఈ చిత్రం ద్వారా విలన్‌గా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, మన్సూర్ అలీ ఖాన్, లివింగ్ స్టన్, తంగ దురై, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గ్రసంత్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎం షఫీ నిర్మిస్తున్నారు. మహాకందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఐస్ నెలఫల్ రాజా సంగీతాన్ని, ఆలీవర్ డేని ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ను రామనాథపురం పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది 1990 ప్రాంతంలో రామనాథపురం జిల్లాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథాచిత్రమని తెలిపారు. చిత్రంలో మనసును ఆకట్టుకునే ప్రేమ సన్నివేశాలతో పాటూ తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని సహజత్వానికి దగ్గరగా రూపొందించినట్లు చెప్పారు. దీనికి వైరముత్తు పాటలను రాయగా ఒక పాటను దర్శకుడు టీ రాజేందర్ పాడడం విశేషం అన్నారు. అన్ని వర్గాలు చూసి ఆనందించే విధంగా రూపొందించినట్లు జనరంజకమైన కథా చిత్రంగా రాజపుత్రన్ ఉంటుందని దర్శకుడు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment