రాబర్ చిత్రం ఎంతో అనుభవాన్నిచ్చింది
తమిళసినిమా: సినీ పాత్రికేయురాలు కవిత నిర్మాతగా మారి ఇంప్రెస్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం రాబర్. ఆనంద్ కష్ణన్ కథ, స్క్రీన్ ప్లే అందించి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో మెట్టు సత్య కథానాయకుడిగా నటించారు జోహాన్ శివనేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. చిత్రాన్ని తమిళనాడులో శ్రీ శక్తి ఫిలిమ్స్ శక్తివేల్ విడుదల చేయనున్నారు. కాగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నిర్మాత త్యాగరాజన్, కలైపులి ఎస్ ధాను,కే భాగ్యరాజ్, నటి రంభ, అంబిక తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ముందుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్ కవిత మాట్లాడుతూ మనిషి కలలు కనాలనీ, వాటిని సాఫల్యం చేసుకోవడానికి కఠినంగా శ్రమించాలని, నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు. తాను వెంటనే చిత్రాన్ని నిర్మించలేదని ముందుగా మూడు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించానని చెప్పారు. అందులో ఒకటి తాత అని ,అందులో 700కు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ హాస్యనటుడు జనకరాజ్ టైటిల్ పాత్రను పోషించినట్లు చెప్పారు.అదేవిధంగా ఎన్నం బోల్ వాళ్కై అనే వీడియో ఆల్బమ్ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తన యు ఒన్ రికార్డ్స్ సంస్థ ద్వారా విడుదల చేశారని చెప్పారు. తన 22 ఏళ్ల పాత్రికేయ జీవితం ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు.నిర్మాత త్యాగరాజన్ వంటి సినీ ప్రముఖుల స్ఫూర్తితోనే తాను నిర్మాతగా మారానని చెప్పారు. తాను నిర్మించిన తొలి చిత్రం రాబర్ అనీ, దీన్ని మహిళా సమస్యలు ఇతి వత్తాన్ని ప్రధాన అంశంగా చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది తనకు ఎంతో అనుభవాన్ని అందించిందని, ఇకపై కూడా మంచి కథ చిత్రాలు చేస్తామని నిర్మాత కవిత పేర్కొన్నారు.
రాబర్ చిత్రం ఎంతో అనుభవాన్నిచ్చింది
Comments
Please login to add a commentAdd a comment