ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ఎస్‌ఆర్‌సీఎం
● ఎస్‌ఏఐ అడుగులు
సాక్షి, చైన్నె: ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ఫిట్‌నెస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి సమష్టిగా ముందుకు సాగేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ), శ్రీ రామ్ చంద్ర మిషన్ (ఎస్‌ఆర్‌సీఎం)లు నిర్ణయించాయి. తెలంగాణ మాజీ గవర్నర్ , పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన జరిగిన శ్రీఆమెశ్రీ బలం– ఆరోగ్యకర భవిష్యత్తు అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నారు. చైన్నెలో ని మనపక్కంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం , ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి సమిష్టి నిబద్ధతను తెలియజేస్తూ సంయుక్తంగా ముందుకు సాగేందుకు తీర్మానించా రు. ఈ సందర్భంగా వెల్నెస్ బై హార్ట్‌ఫుల్ నెస్ సీఎండీ డాక్టర్ వర్మ మాట్లాడుతూ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం చాలా ఆనందం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి మానసిక ఆరోగ్యం, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడానికి సర్టిఫైడ్, అనుభవజ్ఞులైన శిక్షకుల సేవలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. తద్వారా వారి ఫిట్‌నెస్ ఇండియా ఉమెన్స్ వీక్ వేడుకలకు దోహదకరంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యం సంరక్షణ అంశాలలో పెట్టుబడి పెట్టడానికి సమిష్టి నిబద్ధత , ప్రాముఖ్యత గురించి డాక్టర్ వర్మ వివరించారు. సీ్త్ర శక్తిని పెంచే కొన్ని సరళమైన , శక్తివంతమైన ఆయుర్వేద పద్ధతులను గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యాలను ఎదుర్కోవడం మాత్రమే కాదన్నారు. మహిళలు మనుగడ సాగించడానికి మాత్రమే కాకుండా, వద్ధి చెందడానికి జీవితాంతం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment