ఘనంగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం అశేష భక్తజనం నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపం మేళపూడిలోని కుశస్థలినది తీరంలో వెయ్యేళ్ల చరిత్ర నిండిన రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రకారంలో ముళ్ల పొదలు ఆక్రమించి దీప పూజలు నోచుకోని పరిస్థితులు తలెత్తాయి. దీంతో గ్రామీణులు ముందుకొచ్చి ఆలయ పరిశుభ్రం చేసి ఒంటికాల పూజలు చేపట్టారు. గ్రామీణులతో పాటు భక్తుల విరాళాలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు, స్వామివారి వాహనాలకు మరమ్మతులు చేపట్టారు. గోపురంతో పాటూ సన్నిధులు నూతనంగా నిర్మించి అందంగా ఆలయం తీర్చిదిద్దారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటూ మహాకుంభాభిషేకం వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలతో ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి భటాచార్య బృందం హామ పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం మేళ తాళాలతో అశేష భక్తజనం నడుమ పవిత్ర పుణ్యతీర్ధాల కలచాలు బయల్దేరి గోపుర కలశానికి మహాకుంభాభిషేకం చేపట్టారు. ఉదయం 11 గంటలకు రుక్మణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం చేశారు. సాయంత్రం స్వామివారు శేషవాహన సేవలో గ్రామీ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయ నిర్వాహకులు నటరాజన్ ఆధ్వర్యంలో గ్రామీణులు మహాకుంభాభిషేక ఏర్పాట్లు చేశారు.
ఘనంగా మహాకుంభాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment