హక్కుల కోసం సంఘటితం కావాలి
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, భవన నిర్మాణరంగంలో వున్న అసంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని తమిళనాడు వ్యవసాయ కార్మికుల పార్టీ అధ్యక్షుడు పొన్‌కుమార్ పిలుపునిచ్చారు. తమిళనాడు వ్యవసాయ కార్మికుల పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం పట్టణంలోని ప్రయివేటు కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌కుమార్ హాజరై పార్టీలోని సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డుల్లో సభ్యులుగా వున్న వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని, బోర్డులో ఇటీవల కఠినతరం చేసిన నియమాలను వెంటనే సవరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలు తీర్మానాలు చేసి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిస్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment