మందుబాబులను పట్టించే హెల్మెట్‌ | - | Sakshi
Sakshi News home page

మందుబాబులను పట్టించే హెల్మెట్‌

Published Mon, Mar 10 2025 10:53 AM | Last Updated on Mon, Mar 10 2025 10:47 AM

మందుబాబులను పట్టించే హెల్మెట్‌

మందుబాబులను పట్టించే హెల్మెట్‌

– కోవై విద్యార్థినుల సాధన

సేలం: మద్యం మత్తులో వాహనం నడిపే వారి వలన ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో మద్యం తాగే వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా బాధింపబడుతున్నారు. ఈ కారణంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగిన వారిని గుర్తించడం కోసం పోలీసులు చిన్న రకం యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. సంబంధితుల నోట్లో దాన్ని పెట్టి ఊద మంటున్నారు. మద్యం తాగి ఉండే ఆ యంత్రం కనిపెట్టేస్తుంది. ఈ పనిచేయడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వీరి పని సులభతరం చేయడం కోసం కోవైకి చెందిన కళాశాల విద్యార్థినులు అత్యాధునిక హెల్మెట్‌ను రూపొందించారు. ఈ హెల్మెట్‌ మద్యం తాగి బైక్‌ నడిపేవారిని కనిపెట్టేస్తుంది. సెన్సార్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హెల్మెట్‌, బైక్‌ జత చేర్చి ఇది ఉపయోగించబడుతుంది. మద్యం తాగి ఉన్నట్టయితే వాహనాన్ని నడపలేని విధంగా ఈ హెల్మెట్‌ను రూపొందించినట్టు విద్యార్థినులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement