లోక్‌అదాలత్‌లో 4,351 కేసుల పరిష్కారం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 4,351 కేసుల్లో రూ.19.18 కోట్లకు పరిష్కారం చూపినట్టు తిరువళ్లూరు జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప తెలిపారు. జిల్లాలోని పూందమల్లి, పొన్నేరి, తిరుత్తణి, అంబత్తూరు, తిరువొత్తియూరు, పళ్లిపట్టు, ఊత్తుకోట, గుమ్మిడిపూండి, మాధవరం, తిరువళ్లూరు ప్రాంతాల్లోని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ అదాలత్‌లో కుటుంబ కేసులు, మోటారు వాహన ప్రఽమాదాలు, చెక్‌బౌన్స్‌తో పాటు పలు కేసులను విచారణకు స్వీకరించారు. కేసుల విచారణ కోసం మొత్తం 25 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. తిరువళ్లూరులో మెగా లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయమూర్తి జూలియట్‌పుష్ప, సరస్వతి, రమేష్, దీనదయాళన్, సతీష్‌కుమార్, ప్రియ న్యాయమూర్తులు కేసులను విచారించారు. మొత్తం 7,436 కేసులను విచారణకు స్వీకరించగా వీటిలో 4,183 కేసులను పరిష్కరించి రూ.17.49 కోట్లకు పరిష్కారం చూపారు. దీంతో పాటు పెండింగ్‌లో లేని మరో 168 కేసులను సైతం విచారించి 1.68 కోట్లకు పరిష్కారం చూపారు.
Comments
Please login to add a commentAdd a comment