గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో వరుణన్
తమిళసినిమా: ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత అన్భు చెళియన్ సహకారంతో యాకై ్క ఫిలింస్, వాన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన చిత్రం వరుణన్. నటుడు రాధారవి, చరణ్‌రాజ్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో దుష్యంత్, శంకర్‌నాగ్, నటి గాబ్రియల్లా, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. నటి మహేశ్వరి, జీవా రవి, అర్జునాకీర్తీవాసన్, హైడీకార్తీ, ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా జయవేల్ మురుగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బోబో షఫీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక టీనర్‌లోని పీటీ త్యాగరాయర్ కళైయరంగంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జీఎన్.అన్భు చెళియన్, నిటుడు రాధారవి, సంగీతదర్శకుల ద్వయం సబేష్ మురళి, నటుడు కృష్ణ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత, ఫైనాన్సియర్ అన్భుచెళియన్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువకులు కలిసి రూపొందించిన చిత్రం వరుణన్ అని చెప్పారు. చిత్ర దర్శక,నిర్మాతలు తన వద్దకు వచ్చి కథ వినిపించి, సపోర్ట్ చేయాలని కోరారన్నారు. వారి తపనను చూసి, కథ కూడా కొత్తగా ఉండడంతో తాను సపోర్ట్ చేశాననీ, చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. కాగా కథానాయకులలో ఒకరైన దుష్యంత్ నటుడు జయప్రకాశ్ వారసుడు అన్నది గమనార్హం. దీంతో నటుడు జయప్రకాశ్ మాట్లాడుతూ ఈ చిత్ర టీమ్ తన వద్దకు వచ్చి చిత్రం చేస్తామని చెప్పడంతో ఎందుకు అంతా బాగానే సాగుతుందిగా అని చెప్పాన్నారు. అయితే చిత్రం చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో సరేనని చెప్పానన్నారు. ఈ చిత్రానికి అన్భు చెళియన్ సపోర్ట్ చేయడం సంతోషకరం అన్నారు. నీరు ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర కథ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగుతుందన్నారు. చిత్రంలో పాటలు చాలా బాగా వచ్చాయనీ, ఇది చిన్న చిత్రం కాదనీ ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment