అన్ని డ్యామ్‌లలో కాలువ మరమ్మతులు
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్యామ్‌లలోని కాలువల పూడిక తీత పనులతో పాటూ మరమ్మతు పనులు చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్థాన డ్యామ్‌లో రూ.2.50 కోట్ల వ్యయంతో కుడి, ఎడమల కాలువల్లో పూడిక తీత పనులకు కలెక్టర్ సుబ్బలక్ష్మి అద్యక్షతన సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోర్ధాన డ్యామ్ నుంచి గుడియాత్తం, కేవీకుప్పం వరకు సుమారు 31,850 మీటర్ల వరకు పూడిక తీత పనులు చేసేందుకు ప్రస్తుతం అనుమతి పొందడం జరిగిందన్నారు. వీటి ద్వారా గుడియాత్తం, కేవీ కుప్పం, లత్తేరి వంటి ప్రాంతాల్లోని రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలోనే రైతులు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసూం తాము పలు పథకాలను ప్రవేశ పెడుతున్నామని వాటి ద్వారా ప్రజలు అభివృద్ది చెందాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, అములు, యూనియన్ చైర్మన్ రవిచంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment