ఘనంగా వావ్ వండర్ ఉమెన్ అవార్డులు
సాక్షి, చైన్నె: జియో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వావ్ వండర్ ఉమెన్ అవార్డ్స్ – 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన 13 మంది మహిళా ప్రముఖులను వావ్ వండర్ అవార్డులతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం జియో ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శారద రమణి, యాస్మీన్ జవహర్ అలీ, ఐపీఎస్ డాక్టర్ ఎం.సి. సారంగన్ , నటి ఇనియాలు హజరయ్యారు. ఈ అవార్డులను అభిరామి మెగా మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లమై రామనాథన్, హైకోర్టు న్యాయవాది సితార అరంగన్, పాప్ సింగర్ షాలిని సింగ్ బాలాజీ, కర్ణాటిక్ గాయని అక్షయ, రేడియో జాకీ ఆర్జే మిరుదుల ఇంకా మల్లికా చౌదరి, జి శ్రీవిద్య, మహాలక్ష్మీ అశ్విన్, విష్ణుప్రియా హెచ్ భట్ తదితరుల అందుకున్నారు. కార్యక్రమంలో జియోఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రియా జెమీమా, జియో ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన గిరిజన మహిళల కోసం టైలరింగ్ మెషీన్లను విరాళంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment