టీవీకే ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తమిళగ వెట్రికళగం ఆధ్వంర్యంలో తిరువళ్లూరు మెడికల్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ జిల్లా కన్వీనర్ కుట్టి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కుట్టి మాట్లాడుతూ విద్యార్ధినులపై లైంగిక దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోడం దారుణమన్నారు. అన్నావర్సిటీలో విద్యార్ధినిపై అత్యాచారం జరిగితే నిందితులను కాపాడడానికి మంత్రులే రంగంలోకి దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment