తుపాకీ లైసెన్సులు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి
తిరువళ్లూరు: జీవనోపాధి కోసం సంచార కులాలకు చెందిన వ్యక్తులకు నాటు తుపాకీ లైసెన్సులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సబ్‌డివిజన్ పరిధిలో సుమారు రెండువేల సంచార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరు ఆంధ్ర, తెలంగాణా, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి చేపలు, రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. చెరువుల వద్దకు కాకులు వస్తే వాటిని తరమడానికి నాటు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టేవారు. ఈ క్రమంలో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకులను ఎన్నికల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వాటిని తమకు తిరిగి ఇవ్వడంతో పాటు లైసెన్సులు ఇస్తే ఎప్పటిలాగే తాము పనులు చేసుకుంటామని కలెక్టర్ ప్రతాప్‌కు విజ్ఞప్తి చేశారు.ర్ లైసెన్సు ఇచ్చే వ్యవహరంపై తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి ఆర్డీఓను కలెక్టర్ అదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment