కదిలిన మగ్గాలు
● ఫలితం పొందకనే 20 రోజుల సమ్మె విరమణ
తిరుత్తణి: కూలి పెంచాలనే డిమాండ్‌తో మరమగ్గ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను విరమించారు. సోమవారం నుంచి తిరిగి పనులకు వెళ్లడంతో మరమగ్గాలు వేగం అందుకున్నాయి. తిరుత్తణి సమీపంలోని పలు ప్రాంతాల్లో లక్షకు పైబడిన ప్రజలు దాదాపు 50 వేల మరమగ్గాలతో లుంగీలు ఉత్పత్తి చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఇస్తున్న కూలీ తక్కువగా ఉందని, దీనిని పెంచాలనే డిమాండ్‌తో గత నెల 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా వారితో చర్చించేందుకు మాస్టర్ వీవర్స్ ముందుకు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో గత్యంతరం లేక కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment