‘గ్రీవెన్స్‌డే’లో 447 వినతులు
తిరువళ్లూరు: తమ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 447 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వెల్లడించారు. సోమవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.ఇంటి పట్టాల కోసం 8, సాంఘిక సంక్షేమ శాఖకు 78, మౌలిక వసతులు కల్పించాలని 50, ఉపాధి కల్పించాలని 127 వినతులతో సహా మొత్తం 447 వినతులు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment