భగవన్నామస్మరణతోనే ఈశ్వరానుగ్రహం
కొరుక్కుపేట:చైన్నెలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఆదివారం రాత్రి ముగిశాయి. శర్వాణి సంగీత సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులోని శృంగేరి భారతీ విద్యాశ్రమం ఆడిటోరియం ప్రవచనాలకు వేదికై ంది. ‘విష్ణు సహస్రనామ సారవైభవం’ అనే అంశం తన ప్రవచనాలతో షణ్ముఖవర్మ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించారు. చివరి రోజు ఆదివారం శివ పదం పేరుతో నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరిలో ప్రముఖ గాయకులు నిహాల్, వెంకట నాగరాజన్ గానానికి సుదర్శనం (వయోలిన్), ఎస్. విజేంద్రన్ (మృదంగం), కల్యాణ కుమార్ (కీబోర్డు) వాయిద్య సహకారం అందించారు. అనంతరం ప్రవచన కార్యక్రమం సాగింది. తొలుత సామ వేదం షణ్ముఖశర్మ దంపతులను నిర్వాహకులతోపాటు పీవీఆర్ కృష్ణారావు , ఊరా ఆంజనేయులు, ఊరా లక్ష్మీనరసింహారావు, ఊరా శ్రీమన్నారాయణ, చైన్నె కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ కేఎస్‌ఎస్వీ ప్రసాద్, సంగీత విద్వన్మణి డాక్టర్ తాడేపల్లి లోకనాధశర్మ సహా పలువురు తెలుగు ప్రముఖులు సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు . కర్మకొద్దీ వచ్చేవి మనుషుల జన్మలని, భగవన్నామ స్మరణతో మానవాళి పయనిస్తేనే ఈశ్వరుని అనుగ్రహం పొందుతారన్నారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.
భగవన్నామస్మరణతోనే ఈశ్వరానుగ్రహం
Comments
Please login to add a commentAdd a comment