అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న మహిళలు
కొరుక్కుపేట: మహిళలు అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ రేణుకా మోహన్ రావు అన్నారు. సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని, ధైర్యంగా అడుగులు వేస్తే విజయపథంలో దూసుకుపోతారని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఉమెన్స్ అసోసియేషన్ మద్రాసు ( యూడబ్ల్యూఏఎం) ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా సోమవారం జరుపుకున్నారు. దీనికి చైన్నె టి.నగర్‌లోని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రదాన కార్యాలయం వేదికై ంది. అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకార్లు సభకు స్వాగతం పలికి అసోసియేషన్ తరపున విద్యార్థులకు అందిస్తున్న సేవలను సభకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేణుకా మోహన్ రావు ప్రసంగంలో సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నుంచి అవ్వయార్ అవార్డు పొందిన అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు యశోద షణ్ముగసుందరం., అలాగే సీనియర్ ఛాంపియన్‌న్‌షిప్‌లో వివిధ పతకాలు గెలుచుకున్నందుకు సంఘ కార్యదర్శి రుక్మిణికి అభినందనలు తెలిపి గౌరవించారు. అలాగే పరిశోధన చేస్తున్న ఐదుగురు విద్యార్థులకు రూ.25,000 విలువైన మొత్తాన్ని స్కాలర్‌షిప్‌లుగా అందజేశారు.ఇంకా వివిధ నగర కళాశాలలకు చెందిన పేద విద్యార్థులు 20 మందికి రూ. 10,000 వార్షిక స్కాలర్‌షిప్‌లను అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకర్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment