అబుదాబి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం
సేలం : చైన్నె విమానాశ్రయం నుంచి సోమవారం వేకువజామున అబుదాబికి వెళ్లాల్సిన ఎత్తియాట్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో ఆ విమానం రన్‌వే పైనే నిలిపివేశారు. ఆ విమానంలో 168 మంది ప్రయాణికులతో పాటూ 178 మంది అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నారు. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ నుంచి సోమవారం వేకువజామున 4 గంటలకు అబుదాబికి వెళ్లే ఎత్తియట్ విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. అందులో 168 ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బందితో పాటూ 178 మంది ఉన్నారు. విమానం రన్‌వేపై బయలుదేరింది. ఆ సమయంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్టు పైలెట్ గుర్తించి, అకస్మాత్తుగా రన్‌వే పైనే విమానాన్ని నిలిపివేశాడు. అనంతరం ఆ విమానాన్ని రన్‌వైపై నుంచి పక్కకు తప్పించి సాంకేతిక నిపుణులు వచ్చి లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 6 గంటలు అయినప్పటికీ సరిచేయడం వీలుకాకపోవడంతో ప్రయాణికులను విమానంలో నుంచి కిందకి దిపివేశారు. తర్వాత వారిని చైన్నె నగరంలోని పలు హెటళ్లలో బస చేయించారు. కాగా పైలెట్ గుర్తించడంతో 178 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.
రన్ వే పై నిలిపివేత..
178 మంది ప్రయాణికులు సురక్షితం
Comments
Please login to add a commentAdd a comment